ప్రతీ పైసా సద్వినియోగం

దేశ సంక్షేమమే మోదీ లక్ష్యం యూపీ ప్రచార సభలో కేంద్రమంత్రి అమిత్​ షా

May 29, 2024 - 14:53
 0
ప్రతీ పైసా సద్వినియోగం

లక్నో: మోదీ ప్రభుత్వం దేశ సంక్షేమం కోసం ప్రతీ పైసాను సద్వినియోగం చేస్తున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీలోని మహారాజ్​ గంజ్​ లో బుధవారం మంత్రి అమిత్​ షా పాల్గొని ప్రసంగించారు. పీవోకే తమదని దాన్ని స్వాధీనం చేసుకొని తీరతామన్నారు. పాక్​ వద్ద అణుబాంబులుంటే అవి ఎగిరేందుకు ఇంధనం కూడా లేదన్నారు. గతంలో ఎస్పీ ప్రభుత్వ హయాంలో సహారా కుంభకోణం జరిగిందన్నారు. రామభక్తులపై ఎస్పీ కాల్పులకు తెగబడిందని మండిపడ్డారు. కాంగ్రెస్​, ఎస్పీలు కలిసి 70 ఏళ్లుగా రామ మందిర అంశాన్ని పెండింగ్​ లో ఉంచాయన్నారు. మోదీ సమస్యను పరిష్కరించి శ్రీరామునికి మందిరాన్ని కట్టారని అన్నారు. ఎన్నికల్లో రూ. 12 లక్షల కోట్ల కుంభకోణానికి పాల్పడిన భారత కూటమి ఒకవైపు ఉందని, మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ అణా పైసా అవినీతి ఆరోపణలు లేని వ్యక్తి మీ ముందున్నారని అన్నారు. ఈ ఎన్నికలు దురహంకారానికి, నీతి నిజాయితీల మధ్యే అన్నారు. దేశ హితం, క్షేమం కోసం ప్రతిక్షణం ఆలోచించే మోదీకే జై కొట్టాలని అమిత్​ షా పిలుపునిచ్చారు.