మిజోరాం గని ప్రమాదంలో 27 చేరిన మృతులు

27 dead in Mizoram mine accident

May 29, 2024 - 14:15
 0
మిజోరాం గని ప్రమాదంలో 27 చేరిన మృతులు

ఐజ్వాల్​: మిజోరాం లో భారీ వర్షాలకు గని కూలిన ఘటనలో మృతుల సంఖ్య 27కు చేరుకుంది. ఇతర ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి, ఇళ్లు కూలి మరో ఐదుగురు మృతి చెందారు. బుధవారం కూడా శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం శోధన కొనసాగిస్తున్నట్లు డీజీపీ అనిల్​ శుక్లా తెలిపారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులతోపాటు నలుగురు మహిళలున్నారని తెలిపారు. రెమాల్​ తుపాను ప్రభావంతో మిజోరాం, అసోంలోని పలు ప్రాంతాల్లో తుపాను బీభత్సం సృష్టించింది. అసోంలో ఓ మహిళ సహా నలుగురు మృతి చెందగా, 18మందికి తీవ్ర గాయాలయ్యాయి. నాగాలాండ్​ లో నలుగురు మృతి చెందగా 40 ఇళ్లు ధ్వంజమయ్యాయి. మేఘాలయాలోను రెమాల్​ తుపాను విజృంభించడంతో ఇద్దరు మరణించగా, 500మందికి పైగా గాయపడ్డారు.