ఐఎంవోలో భారత్ కు నాలుగు స్వర్ణ, ఒక రజతం
విద్యార్థులను అభినందించిన ప్రధాని మోదీ
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్ లో భారత్ నాలుగు బంగారు, ఒక రజత పతకం సాధించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. పతకాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ విజయం చాలా మంది యువకులకు స్ఫూర్తినిస్తుందన, గణితాన్ని మరింత ప్రాచుర్యం చేయడంలో సహాయ పడుతుందన్నారు.
ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్ (ఐఎవో) ఉన్నత పాఠశాలల విద్యార్థుల కోసం ప్రపంచ చాంపియన్ షిప్ పోటీలను యునైటెడ్ కింగ్‌డమ్‌లోని బాత్‌లో 65వ పోటీలను నిర్వహించారు.
ఈ పోటీల్లో హైస్కూల్ విద్యార్థులు ఆదిత్య మాంగుడి, ఆనంద భాదురి, కనవ్ తల్వార్, రుషీల్ మాథుర్ బంగారు పతకం సాధించారు. అర్జున్ గుప్తా, రజత పతకాన్ని గెలుచుకున్నారు.
108 దేశాలు పాల్గొన్న ఈ పోటీల్లో అమెరికా తొలి, చైనా ద్వితీయ, దక్షిణ కొరియా తృతీయ స్థానాల్లో ఉండగా, భారత్ 166 పాయింట్లతో నాలుగో స్థానాన్ని చేజిక్కించుకుంది. కాగా ఒక్క పాయింట్ ఎక్కువ సాధించి దక్షిణ కొరియా మూడో స్థానంలో నిలిచింది.