హిందూ దేవాలయాల జోలికొస్తే ఖబడ్దార్

దాడులకు పాల్పడ్డ వారిని వెంటనే అరెస్టు చేయాలని ఎస్పీకి వినతి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి ఎంజిరెడ్డి 

Oct 16, 2024 - 20:31
 0
హిందూ దేవాలయాల జోలికొస్తే ఖబడ్దార్
నా తెలంగాణ, సంగారెడ్డి: హిందూ దేవాలయాల జోలికి వస్తే సహించేది లేదని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి హెచ్చరించారు. 
సదాశివపేట పట్టణంలో హనుమాన్ మందిరంలో హనుమాన్ విగ్రహాన్ని, వినాయకుని విగ్రహాలు ధ్వంసం చేయడాని నిరసిస్తూ వీహెచ్​ పీ, బీజేపీ,  హిందూ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ కు బుధవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సదాశివ పేట్ పట్టణంలో హనుమాన్ మందిరంలో వినాయకుని విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను 24 గంటల్లో అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. 
 
రాష్ట్రంలో గత వారం రోజులుగా హిందూ దేవాలయాలపై వరుస దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే హిందువులను రెచ్చగొట్టే విధంగా విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. రాజేశ్వరరావు దేశ్​ పాండే మాట్లాడుతూ సదాశివపేటలో జరిగిన సంఘటన యావత్ హిందూ సమాజానికి అవమానకరమైనదన్నారు. దసరా పండుగ వాతావరణంలో సంతోషంగా ఉన్న హిందువులను రెచ్చగొట్టాలని చూస్తున్నారని దుండగులను వెంటనే అరెస్టు చేయాలని కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు. విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు పవన్ గౌడ్ మాట్లాడుతూ దుండగులను వెంటనే అరెస్టు చేయని పక్షంలో 24 గంటల తర్వాత పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తామని రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులందరూ సదాశివ పేట్​ కు తరలిరావాలని హిందూ సంఘాలకు, హిందువులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ మాణిక్ రావ్, మల్లేశం, ద్వారకా రవి, శ్రీనివాస్, హిందూ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.