తీహార్ రెండో బ్యారక్​లో కేజ్రీవాల్​

హైరిస్క్ బ్యారక్ ​లో గ్యాంగ్​స్టర్లు

Apr 2, 2024 - 18:30
 0
తీహార్ రెండో బ్యారక్​లో కేజ్రీవాల్​

నా తెలంగాణ, ఢిల్లీ: లిక్కర్ కుంభకోణంలో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను తీహార్ జైళ్లో కరడుగట్టిన నేరస్తులున్న బ్యారక్ లోనే ఉంచారు. గ్యాంగ్ స్టర్లు ఛోటారాజన్, జియావుర్​ రెహ్మాన్​లు ఉన్న రెండో బ్యారక్​లోనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్​ ఉన్నారు. సోమవారం కోర్టు ఆదేశాలతో ఆయన్ను తీహార్​ జైలుకు తరలించిన విషయం తెలిసిందే.  కాగా ఈ గ్యాంగ్​స్టర్​లు ఉన్న రెండో బ్యారక్​లోని గదులు, సీఎంను ఉంచిన గదులు చాలా దూరంలో ఉంటాయి. అదీగాక గ్యాంగ్​స్టర్​లు ఉన్న గదుల ప్రాంతాన్ని హై రిస్క్​ ప్రాంతంగా జైలు అధికారులు వ్యవహరిస్తున్నారు. సీఎంను మాత్రం సాధారణ గదిలో హై రిస్క్​లేని ప్రాంతంలో ఉంచినట్లు పేర్కొన్నారు. ఇక్కడ 24 గంటలు భద్రత ఉంటుంది. కాగా కేజ్రీవాల్​కు పలు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. టీవీ, ఇంటిభోజనం, కళ్లద్దాలు, బుక్స్, టేబుల్​వంటి వాటిని ప్రత్యేకంగా అనుమతించారు. ఆయన ఆరుగురిని కలిసేందుకు అనుమతించారు. తీహార్​లో మొత్తం 9 జైళ్లలో 6వ నంబర్​ జైళ్లను మహిళలకు మాత్రమే కేటాయించారు. అయితే ప్రతీ జైలులో హైరిస్క్, నాన్​రిస్క్​ బ్యారక్ లుగా విభజించారు. ఇరు జైళ్లకు సంబంధంచిన విభాగాలు, గదుల్లో 24 గంటలు నిఘా ఉంటుంది. కెమెరాలు, భద్రత ద్వారా నిఘా పెడతారు. సంజయ్​సింగ్, మనీశ్ సిసోడియా, కల్వకుంట్ల కవిత, విజయ్​నాయర్, సత్యేంద్ర జైన్​లు కూడా మద్యం కుంభకోణం కేసులో ఇదే జైలులో ఉన్నారు.