ఎమ్మెల్యేపై నెహ్వాల్ ఆగ్రహం
మహిళలపై వ్యాఖ్యలు శోచనీయం
న్యూఢిల్లీ: బీజేపీ మహిళా ఎమ్మెల్యేపై కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలు నారీశక్తిని కించపరిచే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలకు శనివారం నెహ్వాల్ కౌంటరిచ్చారు. శివశంకరప్ప బీజేపీ ఎంపీ అభ్యర్థి గాయత్రిని ఉద్దేశిస్తూ ఆమె వంటగదికి మాత్రమే సరిపోతారని అన్నారు. దీనిపై నెహ్వాల్ స్పందిస్తూ అమ్మాయిలు పోరాడగలరని అన్నారు. ఓ వైపు దేశంలో నారీశక్తి వందనం అనే కార్యక్రమాలు ఉధృతంగా కొనసాగి మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంటే, ప్రధాని మోదీ ఆధ్వర్యంలో పెంపొదిస్తుంటే వారిని కించపరిచేలా వ్యాఖ్యానించడం సరికాదన్నారు. మోదీ ఆధ్వర్యంలో 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు లభించడం సంతోషకరమన్నారు. స్త్రీలను ఇప్పటికే కొంతమంది ఇలాంటి వ్యక్తులు ద్వేషించడం నిజంగా బాధాకరమని నెహ్వాల్ పేర్కొన్నారు.