ఎంపీ ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టో కమిటీ నియామకం
ఎంపీ ఎన్నికల కోసం బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీని శనివారం ఏర్పాటు చేసింది.
న్యూఢిల్లీ: ఎంపీ ఎన్నికల కోసం బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీని శనివారం ఏర్పాటు చేసింది. ఈ మేరకు జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఓ ప్రకటనను విడుదల చేశారు. కమిటీకి అధ్యక్షుడిగా రాజ్‌నాథ్ సింగ్ ను నియమించారు. నిర్మలా సీతారామన్ కన్వీనర్, పీయూష్ గోయల్ కో కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. 27 మంది సభ్యుల ఎన్నికల మేనిఫెస్టో కమిటీలో కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అశ్విని వైష్ణవ్, స్మృతి ఇరానీ, రాజీవ్ చంద్రశేఖర్, కిరణ్ రిజిజు, అర్జున్ ముండా తదితరులు సభ్యులుగా ఉంటారు. అర్జున్ రామ్ మేఘ్వాల్, భూపేందర్ యాదవ్, విష్ణు దేవ్ సాయి, భూపేందర్ పటేల్, శివరాజ్ సింగ్ చౌహాన్, మోహన్ యాదవ్, వసుంధర రాజే, రవిశంకర్ ప్రసాద్‌లు ఎన్నికల మేనిఫెస్టో కమిటీలో సభ్యులుగా ఉన్నారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించే బృందంలో భాగంగా అసోం సీఎం హిమంత బిస్వా శర్మను కూడా బీజేపీ అధిష్టానం నియమించింది.