అంబేద్కర్ కు వ్యతిరేకంగా నెహ్రూ ప్రచారం నిజం కాదా?
Nehru's campaign against Ambedkar is not true?
పార్లమెంట్ లో కాంగ్రెస్ నిరసనలపై ప్రధాని మోదీ ఫైర్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: డా. బాబా సాహేబ్ అంబేద్కర్ ను రెండుసార్లు ఓడించేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని, ఆయనకు వ్యతిరేకంగా నెహ్రూయే ప్రచారం చేసింది నిజమా? కాదా? అని ప్రధాని నరేంద్ర మోదీ నిలదీశారు. పార్లమెంట్ భవన్ లో బుధవారం విపక్షాల నిరసనను మోదీ ట్వీట్ ద్వారా ఎండగట్టారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలను కించపరిచేందుకు, అంబేద్కర్ వారసత్వాన్ని కించపరిచేందుకు కాంగ్రెస్ పార్టీచేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావన్నారు. ఇప్పుడు కళ్లబొల్లి మాటలతో కన్నీరుకారుస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో అక్రమాలు, అసత్యాలు దాగవన్నారు. వీరి కుటుంబ రాజకీయం వల్ల అంబేద్కర్ నిరాదరణకు గురయ్యారని ఆరోపించారు. ఆయనకు భారత్ రత్న నిరాకరించిందెవరని ప్రశ్నించారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో అంబేద్కర్ చిత్రపటం ఏర్పాటు చేయడాన్ని నిరాకరించిందెవరని నిలదీశారు. కాంగ్రెస్ ఎంతగా ప్రయత్నించినా వారి ఆటలు ఇక సాగబోవన్నారు. ఎస్సీ, ఎస్టీలపై దాడులు, మారణకాండలు జరుగుతుంటే చూస్తూ కూర్చున్నారే తప్ప చర్యలు తీసుకోలేదని, కనీసం ఖండించలేదన్నారు. ఏళ్ల తరబడి అధికారంలో ఉన్నా ఎస్సీ, ఎస్టీల సాధికారత కోసం ఏం చేశారని ప్రధాని మోదీ కాంగ్రెస్, విపక్షాలను నిలదీశారు.