హమాస్ తరహాలో నక్సల్స్ సొరంగాలు
Naxals tunnels like Hamas
ఆయుధాల తయారీ
గుర్తించిన భద్రతా బలగాలు
దేవకొండల వైపు పారిపోయిన నక్సల్స్ అగ్రనేత హిడ్మా
రాయ్ పూర్: చత్తీస్ గఢ్ లో నక్సల్స్ హమాస్ ఉగ్రవాదుల తరహా సొరంగాల్లో తలదాచుకుంటున్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి. అందులోనే భారీ ఎత్తున ఆయుధాలు, రాకెట్ లాంచర్లు కూడా తయారు చేస్తున్నట్లు గుర్తించారు. శనివారం ఇందుకు సంబంధించిన ఆధారాలను భద్రతా దళాలు బయటపెట్టాయి. సొరంగాల్లో ఆయుధాల ఫ్యాక్టరీనే ఏర్పాటు చేశారా? అన్న రీతిలో ముడిపదార్థాలను ఆర్మీ స్వాధీనం చేసుకుంది. బీజాపూర్ జిల్లాలోని ఉసుక్ బ్లాక్ పూజారి కంకేర్, మరుద్ బాక అటవీ ప్రాంతంలో భద్రతా సిబ్బంది ఈ సొరంగాన్ని గుర్తించాయి. రెండురోజుల క్రితం జరిగిన ఎన్ కౌంటర్ లో భారీ ఎత్తున నక్సల్స్ మృతి చెందారు. అనంతరం నిర్వహించిన కూంబింగ్ లో ఈ సొరంగాన్ని కనుగొన్నారు. పెద్ద పెద్ద మిషన్ ల సహాయంతో ఆయుధాలను తయారు చేసేవారని గుర్తించారు. పెద్ద సంఖ్యలో ఆయుధాల తయారీకి వినియోగించే ఇనుము, పైపులు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఎన్ కౌంటర్ సందర్భండి హిట్ లిస్టులో ఉన్న హిడ్మా దేవ కొండల వైపు పారిపోయి ఉంటాడని భద్రతా దళాలు భావిస్తున్నాయి.