రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి ఆజ్యం పోస్తున్న జర్మనీ ప్రకటన
Germany's announcement is fueling the Russia-Ukraine war
ఢిల్లీ: రష్యా –ఉక్రెయిన్ యుద్ధానికి జర్మనీ ప్రకటన మరింత ఆజ్యం పోసేలా ఉంది. ఉక్రెయిన్ కు తామిచ్చిన ఆయుధాలు ఒప్పందం ప్రకారం కాకుండా తమ రక్షణ కోసం ఏ సమయంలోనైనా, యుద్ధంలోనైనా వినియోగించుకోవచ్చని జర్మనీ శుక్రవారం ప్రకటించింది. ఈ ప్రకటన రష్యాకు మరింత ఆగ్రహం తెప్పించేలా ఉంది. పలుమార్లు పుతిన్ ఉక్రెయిన్ కు ఇతర దేశాల సహాయంపై భగ్గుమన్న విషయం తెలిసిందే. మరోవైపు బెల్జియం ఉక్రెయిన్ కు ఎఫ్–16 30 విమానాలను కూడా అందిస్తామని ప్రకటించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ విమానాలను, ఆయుధాలను రష్యా తో యుద్ధంలో వినియోగిస్తామని ప్రకటించారు. పాశ్చాత్య దేశాలు అందించిన ఆయుధాలు, విమానాల ద్వారా ఉక్రెయిన్ దాడికి దిగితే తీవ్ర పరిస్థితులు ఉంటాయని ఇటీవలే ఉజ్బెకిస్థాన్ పర్యటన సందర్భంగా పుతిన్ వ్యాఖ్యలు చేశారు.