గణతంత్ర వేడుకల్లో ఆర్మీ బలాన్ని చాటుతాం

మేజర్​ జనరల్​ సుమిత్​ మెహతా

Jan 23, 2025 - 18:18
 0
గణతంత్ర వేడుకల్లో ఆర్మీ బలాన్ని చాటుతాం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: 76వ గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధమైందని, భారత సైన్యం బలాన్ని ప్రదర్శన ద్వారా చాటి చెబుతామని ఆర్మీ మేజర్​ జనరల్​ సుమిత్​ మెహతా అన్నారు. గణతంత్ర వేడుకలపై గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. భారత సైన్యం నేతృత్వంలో యుద్ధభూమి, నిఘా వ్యవస్థ, ప్రళయ్​ ఆయుధ వ్యవస్థ, డీఆర్డీవో రూపొందించిన ఆయుధాల ప్రదర్శన కవాతులో ఉంటాయన్నారు. భీష్మ, టీ–90 ట్యాంక్​, నాగ్​ మిస్సైల్​ సిస్టమ్​, బజరంగ్​ లైట్​ స్పెషలిస్ట్​ వాహనం, నందిఘోష్​ క్విక్​ రియాక్షన్​ ఫోర్స్​ వాహనం, బ్రహ్మోస్​, అగ్నిబాన్​, పినాక, ఆకాశ్​ వెపన్​ సిస్టమ్​ లను ప్రదర్శించనున్నామన్నారు. భారత సైన్యంతో బాటు పరేడ్​ లో ముఖ్య అతిథిగా ఇండోనేషియా బ్యాండ్​ కు చోటు కల్పించామన్నారు. ఇందులో 352 మంది ఇండోనేషియా సైనికులు పాల్గొంటారని స్పష్టం చేశారు. ఆర్మీ కవాతు బృందానికి నాయకత్వాన్ని కెప్టెన్​ రితికా ఖరేటాకు అప్పగించామన్నారు. ఈ ఏడాది జరగనున్న గణతంత్ర వేడుకల్లో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి మొత్తం 26 శకటాలు ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.