78 టన్నుల డ్రగ్స్​ ధ్వంసం!

78 tons of drugs destroyed!

Jan 23, 2025 - 18:59
 0
78 టన్నుల డ్రగ్స్​ ధ్వంసం!

భోపాల్​: ఉజ్జయిని మండలంలోని ఏడు జిల్లాల్లో 78 టన్నుల డ్రగ్స్​ ను పోలీసులు ధ్వంసం చేశారు. వివిధ రూపాల్లో ఉన్న ఈ డ్రగ్స్​ విలువ సుమారు రూ. 8600 కోట్లుగా పోలీసులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం 10 రకాల డ్రగ్స్​ ను నీముచ్​ జిల్లా జవాద్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని విక్రమ్​ సిమెంట్​ ఫ్యాక్టరీ బాయిలర్​ లో ధ్వంసం చేశారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు మధ్యప్రదేశ్​ లోని ఏడు జిల్లాల నుంచి స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ను ఉజ్జయిని జోన్ ఐజీ ఉమేష్ కుమార్, యోగా రట్లం రేంజ్ డీఐజీ మనోజ్ కుమార్ సింగ్, నాలుగు జిల్లాల ఎస్పీలు, పెద్ద సంఖ్యలో డీఎస్పీ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్‌లు, దాదాపు 200 మంది పోలీసుల సమక్షంలో ధ్వంసం చేశారు. ఆయా పోలీస్​ స్టేషన్లలో 456 కేసుల్లో దోడచూర, నల్లమందు, స్మాక్​, ఎండీఎం, గంజాయి, చరస్​ ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నల్లమందుకు నీముచ్​ మంద్​ సౌర్​ జిల్లాలు ప్రసిద్ధి ఈ నేపథ్యంలో ఈ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. దీంతో పెద్ద ఎత్తున డ్రగ్స్​ ను స్వాధీనం చేసుకొని ప్రభుత్వ ఆదేశాలు, నియమ నిబంధనల మేరకు ధ్వంసం చేశామని పోలీసు అధికారులు వివరించారు.