సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి
టీపీయూఎస్ జిల్లాధ్యక్షులు గణపురం డిమాండ్
నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ
ఉపాధ్యాయులకిచ్చిన హామీలు అమలు చేయాల్సిందే
నా తెలంగాణ, మొయినాబాద్: సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని జిల్లా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) అధ్యక్షులు గణపురం సురధీర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఉపాధ్యాయులకిచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలన్నారు. మంగళవారం మొయినాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను సురధీర్, అజీజ్ నగర్ పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శేఖర్ రెడ్డిలు ఆవిష్కరించారు. మండలంలోని బాకారం, ఆమ్దాపూర్, తోల్ కట్ట, పెద్ద మంగళారం, రెడ్డిపల్లి పాఠశాలల్లోనూ క్యాలెండర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా గణపురం సురధీర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎస్జీటీ ఉపాధ్యాయులకు ఓటు హక్కు కల్పించాలన్నారు. ఉపాధ్యాయులకు కూడా కార్పొరేట్ ఆసుపత్రుల హెల్త్ కార్డులు అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కేజీబీబీ ఉపాధ్యాయులకు పే స్కేల్ అమలు చేయాలని, వెంటనే పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయ బిల్లులు, ఐదు డీఏల విడుదల, పీఆర్సీ అమలు చేయాలని గణపురం డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు ఎం. తుకారాం, మండల ప్రధాన కార్యదర్శి వినోద్ యాదవ్, మండల గౌరవ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్, జోసెఫ్ రెడ్డి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.