మహాకుంభ్​ దేశ ఐక్యతకు నిదర్శనం

కేంద్రమంత్రి అమిత్​ షా

Jan 23, 2025 - 17:00
 0
మహాకుంభ్​ దేశ ఐక్యతకు నిదర్శనం

గాంధీనగర్​: మహాకుంభ్​ దేశ ఐక్యతకు మత సామరస్యానికి బలమైన సందేశాన్నిస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా అన్నారు. గురువారం గుజరాత్ యూనివర్సిటీ మైదానంలో హిందూ స్పిరిచువల్ అండ్ సర్వీస్ ఫెయిర్‌ను ప్రారంభించిన అనంతరం షా ప్రసంగించారు. ప్రతీ ఒక్కరూ ప్రయాగ్​ రాజ్​ ను సందర్శించి మహాకుంభ్​ మేళాలో పుణ్యస్నానాలు ఆచరించాలన్నారు. తాను జనవరి 27వ తేదీన కుంభమేళాకు వెళ్లనున్నానని తెలిపారు. మోదీ నేతృత్వంలోని గత పదేళ్ల పాలనలో దేశ ఐక్యతను పటిష్ఠం చేయగలిగామన్నారు. ఆర్టికల్​ 370 రద్దు, అయోధ్య నిర్మాణం వంటి పెద్ద నిర్ణయాలతో దేశ ఐక్యతను చాటుకున్నామన్నారు. దేశంలో ఇంతపెద్ద ఎత్తున జరుగుతున్న కార్యక్రమం ద్వారా ప్రపంచదేశాలకు ఐక్యత సందేశం వెళ్లాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారని అన్నారు. ఎంతోమంది విదేశీ రాయబారులు కూడా తమకు ఆహ్వానం అందించాలని అభ్యర్థించారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎవ్వరి అనుమతి అవసరం లేదని చెబితే వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఇప్పటికే సగం మంది వరకు వచ్చి పుణ్య స్నానాలు ఆచరించి వెళ్లారని మరింత మంది మేళా ముగిసే వరకు వస్తారని షా స్పష్టం చేశారు. 70ఏళ్లలో పూర్తి చేయని అసంపూర్తి పనులన్నింటినీ మోదీ ప్రభుత్వం పూర్తి చేసి ప్రపంచానికి భారత్​ అంటే ఏంటో చాటి చెప్పగలిగిందని మంత్రి అమిత్​ షా పునరుద్ఘాటించారు.