కాల్పుల విరమణకు ఇజ్రాయెల్​ క్యాబినెట్​ ఆమోదం

Israeli cabinet approves ceasefire

Jan 18, 2025 - 12:53
 0
కాల్పుల విరమణకు ఇజ్రాయెల్​ క్యాబినెట్​ ఆమోదం

దశల వారీగా ఇరుదేశాల బందీల విడుదల
ఒప్పందానికి ఇరుదేశాలు కట్టుబడి ఉండాల్సిందేనన్న యూఎస్​
15 నెలల సుధీర్ఘ యుద్ధానికి తెర
మధ్యప్రాచ్యంలో శాంతియుత వాతావరణానికి సై
వ్యతిరేకించిన నెతన్యాహు వర్గం ఎనిమిది మంది ఎంపీలు
హమాస్​ కు లొంగొద్దు.. రాజీనామాకు సిద్ధం

జెరూసలెం: ఎట్టకేలకు గాజాస్ర్టిప్​ కాల్పుల విరమణకు ఇజ్రాయెల్​ క్యాబినెట్​ ఆమోదం తెలిపింది. కాల్పుల విరమణకు ఒక రోజు ముందు శనివారం ఈ విషయాన్ని పీఎం బెంజమిన్​ నెతన్యాహు కార్యాలయం వెల్లడించింది. దీంతో కాల్పుల విరమణపై ఉన్న అనుమానాలు పూర్తిగా తొలగిపోయినట్లేనని భావిస్తున్నారు. ముఖ్యంగా బందీల విడుదల కోసమే పాలస్తీనా మిలిటెంట్​ గ్రూప్​ హమాస్​ తో ఒప్పందం చేసుకున్నట్లుగా తెలిపింది. దీంతో 15 నెలల సుధీర్ఘ యుద్ధానికి తెరపడతుందని భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్​ పదవీ ప్రమాణ స్వీకారం చేపట్టేందుకు ఒక రోజు ముందే కాల్పుల విరమణ ఆంక్షలు అమలు కానున్నాయి. దీంతో మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలకు బ్రేక్​ పడింది. 

క్యాబినెట్​ ఆమోదంపై యూఎస్​ మంత్రి మెక్​ గర్క్​ మాట్లాడుతూ.. ఆదివారం ఉదయం నుంచి కాల్పుల విరమణ ఉంటుందన్నారు. మధ్యాహ్నం రెడ్​ క్రాస్​ ఆధ్వర్యంలో ఇజ్రాయెల్​ మహిళా బందీలు ముగ్గురిని హమాస్​ విడుదల చేయనుందని ప్రకటించారు. ఒప్పందంలోని కీలకాంశాలపై ఇరువురు కట్టుబడి ఉండాల్సిందేనన్నారు. 9మంది ఇజ్రాయెల్​ బందీలలో 33 మంది తొలిదశలో విముక్తి పొందుతారన్నారు. అదే సమయంలో ఇజ్రాయెల్​ జైళ్లలో ఉన్న 19 ఏళ్లలోపు పాలస్తీనా మహిళలు, పిల్లలను విడుదల చేస్తుందన్నారు. దశల వారీగా విడుదల కానున్న పాలస్తీనా ఖైదల పేర్లను కూడా ఇజ్రాయెల్​ ప్రకటించింది. ఒప్పందం ప్రకారం ప్రతీ ఏడురోజులకు ఒకసారి ఏడుగురు బందీలను ఇరువురు విడుదల చేసుకుంటారని తెలిపారు. 

కాగా ఇజ్రాయెల్​ క్యాబినెట్​ లో నెతన్యాహు వర్గానికి చెందిన 24 మంది కాల్పుల విరమణకు అనుకూలంగా ఓటు వేయగా, 8మంది వ్యతిరేకించారు. వెంటనే ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని లేకుంటే రాజీనామా చేస్తామని బెదిరించారు. అదే సమయంలో తమకు ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశ్యం లేదని, హమాస్​ కు లొంగిపోవడాన్నే తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. 

మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందం ఆరంభం కాగానే గాజాలోని నిరాశ్రయులకు పెద్ద ఎత్తున సహాయం చేసేందుకు నాలుగువేల ట్రక్కుల సామాగ్రితో సిద్ధంగా ఉన్నాయి. ఇందులో బియ్యం, పిండి, ఇతర ఆహారం, మందులు, బట్టలు, రోజువారీ అవసరాలకు సంబంధించిన వస్తువులు తదితరాలున్నాయి.