డప్పు కళాకారునికి ప్రధాని వందనం

Prime Minister salutes the drum artist

Jan 15, 2025 - 12:34
Jan 15, 2025 - 13:29
 0
డప్పు కళాకారునికి ప్రధాని వందనం

హర్షం వ్యక్తం చేసిన మిట్టపల్లి
కేంద్రమంత్రి ఇంట సంక్రాంతి సందడి

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి ఇంట సంక్రాంతి సందడి నెలకొంది. న్యూఢిల్లీలోని మంత్రి నివాసంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రధాని మోదీకి కేంద్రమంత్రి దంపతులు జి.కిషన్​ రెడ్డి, కావ్య కిషన్​ రెడ్డిలు శాలువాతో సత్కరించారు. 

ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డప్పు కళాకారుడికి చేతులు జోడించి వందనం చేయడం పట్ల ప్రముఖ కవి, గాయకుడు సురేందర్​ మిట్టపల్లి ప్రధాని మోదీని పొగిడారు. అత్యంత సంతోషం వ్యక్తం చేస్తూ తన కవిత్వానికి పనిచెప్పారు. 

‘‘ఎంత గొప్ప దృశ్యం ఇది ప్రధాని మోదీ నుదుటితో తాకి  మొక్కినందుకు చెప్తలేను  అంటరాని మనుషులని పట్టుకోకూడని చేతులని ఊరికి అవతల నిలబెట్టి తరతరాలుగా అవమానించుతూ అదే గుడిసెల ముందు నిలబడి మేము ఎన్నికల్లో నిలబడ్డాం మమ్మల్ని పదవుల్లో నిలబెట్టేందుకు మా పాదయాత్రకు దరువు కొట్టండి. మేము ఎన్నికల్లో గెలిచాం మా విజయయాత్రకు డప్పు కొట్టండని పిలిచి ఊరేగిన నేతలందరినీ అడుగుతున్న ఎప్పుడైనా మీ కోసం ముందునడిచి మిమ్ముల గెలిపించిన ఆ చేతుల్ని మనుషుల్ని ఎన్నడన్న కనీసం మనుషులని గుర్తించారా ఆలోచించుకోండి  అందుకే ఈ దృశ్యం  నా గుండెను కదిలించింది  ప్రధాని మోదీ ఈసారి మా తెలంగాణకు రండి మా గుండెల్ని డప్పు చేసి కొడుతం మీకోసం’’ అంటూ సురేందర్​ మిట్టపల్లి తన కవిత్వం ద్వారా హర్షం వ్యక్తం చేశారు.