జీ–7లో మోదీకి ఘన స్వాగతం

రష్యా, ఉక్రెయిన్​ లపైనే ప్రధానంగా చర్చలు మోదీని శాంతిదూతగా అభివర్ణించిన పోప్​ ఫ్రాన్సిస్​

Jun 14, 2024 - 21:22
 0
జీ–7లో మోదీకి ఘన స్వాగతం

రోమ్​: జీ–7 శిఖరాగ్రంలో పాల్గొనేందుకు ఇటలీకి చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. శుక్రవారం సాయంత్రం జీ–7 సమావేశానికి హాజరైన మోదీకి ఇటలీ ప్రధాని జార్జియా మెలోని నమస్తేతో స్వాగతం పలికారు. అనంతరం ప్రధానమంత్రి పలువురు దిగ్గజ నాయకులను కలుసుకున్నారు. రిషి సునక్​, మాక్రాన్​, జెలెన్స్కీలతో కలిసి పలు విషయాలపై చర్చించారు. అనంతరం రాత్రి 7 గంటలకు సమావేశంలో పాల్గొన్నారు. ప్రపంచ శాంతి దూత పోప్ ఫ్రాన్సిస్ ను కలుసుకున్న ప్రధాని మోదీ ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీని పోప్​ శాంతిదూతగా అభివర్ణించడం విశేషం.

ఉక్రెయిన్​ కు సహాయం.. రష్యాపై ఆంక్షలు..

అయితే జీ–7 దేశాల శిఖరాగ్ర సమావేశంలో ప్రధానంగా ఉక్రెయిన్​ కు సహాయంపైనే చర్చలు కొనసాగాయి. ఉక్రెయిన్​ కు 4.17 కోట్ల ప్యాకేజీని అందించాలని జీ–7 దేశాలు నిర్ణయించాయి. వివిధ దేశాల్లో రష్యా ఆస్తుల నుంచి వచ్చే ఆదాయాన్ని ఉక్రెయిన్​ కు మళ్లించాలని నిర్ణయించాయి. ఇప్పటికే పలు జీ–7 దేశాల్లో ఉన్న రష్యా ఆస్తులు స్తంభించిపోయాయి. వీటి విలువ రూ. 21.72 లక్షల కోట్లు. అయితే చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉక్రెయిన్​ కు నిధులు ఎలా సమకూర్చాలన్నదానిపై ప్రధానంగా చర్చలు కొనసాగాయి. భారీ విధ్వంసం నేపథ్యంలో రష్​యా పరిహారం చెల్లించే వరకు ఆస్తులపై ఆంక్షలను కొనసాగించాలని నిర్ణయించాయి. ఈ ఏడాది నుంచే ఉక్రెయిన్​ కు నిధులు అందజేయాలని నిర్ణయించాయి.