ఇద్దరు ఉగ్రవాదులను ఎన్​ కౌంటర్​ చేసిన ఐడీఎఫ్​

The IDF encountered two terrorists

Jan 23, 2025 - 17:41
 0
ఇద్దరు ఉగ్రవాదులను ఎన్​ కౌంటర్​ చేసిన ఐడీఎఫ్​

జెరూసలెం: జనవరి 6న ఇజ్రాయెల్​ లో జరిగిన బస్సు దాడిలో ప్రమేయం ఉన్న ఇద్దరు ఉగ్రవాదులను వెస్ట్​ బ్యాంక్​ లో హతమార్చినట్లు ఐడీఎఫ్​ ప్రకటించింది. బుధవారం రాత్రి చేపట్టిన ఆపరేషన్​ వివరాలను గురువారం ఇజ్రాయెల్​ మీడియాతో పంచుకుంది. టూరిస్ట్​ వీసాపై వచ్చిన ఇస్లామిక్​ జిహాద్​ ఉగ్రవాది బస్సులో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. దాడి సందర్భంగా ఉగ్రవాదిని కూడా అక్కడే ఐడీఎఫ్​ మట్టుబెట్టింది. ఈ దాడికి కారకులైన మహ్మద్​ నజాల్​, కతీబా అల్​ షలాబీగా గుర్తించి వారి జాడ కనుగొంది. బుధవారం అర్థరాత్రి వెస్ట్​ బ్యాంక్​ లోని బుర్కిన్​ గ్రామంలో వీరున్న భవనంపై ఆకస్మికంగా దాడి చేసి ఇద్దరిని హతమర్చింది. ఈ ఆపరేషన్​ లో ఐడీఎఫ్​ సైనికుడికి గాయాలయ్యాయని స్పష్టం చేసింది. హమాస్​ తో కలిసి ఇస్లామిక్​ జిహాద్​ మిత్రపక్షాలు పలు దాడులకు పాల్పడుతుంటాయి. ఈ రెండు వేర్వేరు ఉగ్ర సంస్థలైనప్పటికీ పలుమార్లు ఏకమై తమ వ్యతిరేకులపై భారీ దాడులకు పాల్పడిన సందర్భాలు అనేకం ఉన్నాయి.