టూటికోరిన్ కు బాంబు బెదిరింపు
Bomb threat to Tuticorin
చెన్నై: తమిళనాడులోని టూటికోరిన్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది. గురువారం ఈ మెయిల్ ద్వారా బెదిరింపు రావడంతో విమానాశ్రయ భద్రతా వర్గాలు అప్రమత్తమయ్యాయి. బాంబు, డాగ్ స్క్వాడ్ లను రంగంలోకి దింపి అణువణువు శోధించాయి. బెదిరింపు నేపథ్యంలో ప్రయాణికుల భద్రత, చెకింగ్ లను మరింత పటిష్ఠంగా నిర్వహిస్తున్నారు. ప్రయాణికులకు ఇంటెన్సివ్ స్ర్కీనింగ్ చేస్తున్నారు. మరోవైపు బాంబు బెదిరింపుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా తనిఖీల్లో ఏమీ లభించకపోవడంతో అధికారులు, ప్రయాణికులు ఉపిరీ పీల్చుకున్నారు.