బస్తర్​ లో పోలింగ్​ ఈసీకి సవాల్​ విసురుతున్న నక్సల్స్​

హెచ్చరికలు నిర్భయంగా ఓటు వేయాలన్న డిప్యూటీ సీఎం అరుణ్​ సావో భారీ భద్రత నడుమ ఎన్నికలు సజావుగా జరిపిస్తామన్న ఈసీ

Apr 18, 2024 - 19:25
 0
బస్తర్​ లో పోలింగ్​ ఈసీకి సవాల్​ విసురుతున్న నక్సల్స్​

రాయ్​ పూర్​: బస్తర్​ లో ఎన్నికల నిర్వహణ ఈసీకి కత్తిమీద సాములా మారింది. ఈ సవాల్​ ను స్వీకరిస్తూ పోలింగ్​ శాతాన్ని పెంచేందుకు ఈసీ భారీ భద్రతా చర్యలను చేపట్టింది. ఓ వైపు సామాన్య ప్రజానీకాన్ని పోలింగ్​ స్టేషన్లకు రప్పించాలనే ప్రయత్నంలో భాగంగా ఈసీ చర్యలు తీసుకుంది. మరోవైపు ఇటీవలే చత్తీస్​ గఢ్​ లో జరుగుతున్న వరుస ఎన్​ కౌంటర్లతో మావోయిస్టులు పలు పోలింగ్​ స్టేషన్లను మూసివేయాలని హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు. బస్తర్ లోక్‌సభ నియోజకవర్గంలో కొండగావ్, నారాయణపూర్, చిత్రకోట్, దంతెవాడ, బీజాపూర్, కొంటా ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మరో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు, బస్తర్, జగదల్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 

ఇక్కడ ఓటర్ల సంఖ్య 614. వీరిలో 342 మంది మహిళలు, 272 మంది పురుషులు ఉన్నారు. ఈ ఓటింగ్‌కు సంబంధించిన పోలింగ్ బృందం భారీ భద్రత నడుమ గురువారం సాయంత్రం చేరుకుంది. 

నక్సలైట్ల బెదిరింపు కరపత్రానికి సంబంధించి డిప్యూటీ సీఎం అరుణ్ సావో  మీడియాతో మాట్లాడారు. భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయని, శాంతిభద్రతలను తమ చేతుల్లోకి తీసుకునేందుకు ఎవరినీ అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. బస్తర్​ నుంచి పూర్తిగా నక్సలిజం నిర్మూలనే లక్ష్యంగా తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అదే సమయంలో శుక్రవారం ఉదయం పెద్ద సంఖ్యలో ఓటర్లు నిర్భయంగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.