బాసర అభివృద్ధికి నిధులు ఇవ్వండి

ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్

Jun 22, 2024 - 19:16
 0
బాసర అభివృద్ధికి నిధులు ఇవ్వండి

నా తెలంగాణ, నిర్మల్: నిర్మల్ జిల్లాలోని బాసర జ్ఞాన సరస్వతీ దేవాలయాభివృద్ధికి నిధులు కేటాయించాలని ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ కోరారు. ఈ మేరకు రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను ఆయన మర్యాద పూర్వకంగా శనివారం కలిశారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖతో మాట్లాడుతూ బాసర సరస్వతి ఆలయాభివృద్ధి కోసం గత ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 50 కోట్ల నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకుందన్నారు. ఆ నిధులను విడుదల చేసి పనులను పునః ప్రారంభించేలా చూడాలని కోరారు. అంతేకాకుండా ప్రసాద పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా వచ్చేలా చూస్తానని మంత్రికి ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో ముథోల్ నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధి కోసం వర్క్ ఆర్డర్​ ఇవ్వాలని మంత్రి దేవాదాయ కమిషనర్​ కు సూచించారు.