ఐడీఎఫ్​ దాడిలో సఫీద్ధీన్​ మృతి

హిజ్బొల్లాకు కాబోయే చీఫ్​ నస్రుల్లా సోదరుడు

Oct 4, 2024 - 17:38
 0
ఐడీఎఫ్​ దాడిలో సఫీద్ధీన్​ మృతి

ఏ ఒక్కరిని విడిచిపెట్టబోమన్న ఇజ్రాయెల్​
దాడులతో దద్దరిల్లుతున్న లెబనాన్​

బీరూట్​:  హిజ్బొల్లాపై ఇజ్రాయెల్​ ఆపరేషన్​ కొనసాగుతోంది. శుక్రవారం బీరూట్​ లో ఐడీఎఫ్​ జరిపిన బాంబుదాడుల్లో నస్రుల్లా తరువాత చీఫ్​ గా ప్రకటించబడ్డ హషీమ్​ సఫీద్దీన్​ ను మట్టుబెట్టినట్లు ఐడీఎఫ్​ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హర్జీ హలేవీ ప్రకటించారు. ఐడీఎఫ్​ ఏ ఒక్క హిజ్బొల్లా ఉగ్రవాదిని విడిచిపెట్టబోదన్నారు. టాప్​ కమాండర్లందరినీ హతమారుస్తామన్నారు. సఫీద్దీన్​ బంకర్​ లో రహస్య సమావేశం నిర్వహిస్తుండగా దాడి చేశామని ప్రకటించారు. నస్రుల్లా సోదరుడే సఫీద్దీన్​. సఫీద్ధీన్​ ను హిజ్బొల్లా చీఫ్​ గా నిర్ణయించారు. నేడో రేపో ప్రకటించాలని భావించారు. ఈ లోపే ఐడీఎఫ్​ హషీమ్​ ను మట్టుబెట్టింది. లెబనాన్​ లో హిజ్బొల్లా స్థావరాలపై భూతల, ఆకాశమార్గాన ఐడీఎఫ్​ దాడులకు పాల్పడుతోంది. దాడుల భయంతో చాలామంది సామాన్య పౌరులు లెబనాన్​ ను వీడి సిరియాకు పయనమవుతున్నారు.