ఢిల్లీ వాతావరణం మెరుగు సడలింపునిచ్చిన సుప్రీంకోర్టు
Delhi's climate has been relaxed by the Supreme Court
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: క్రమేణా ఢిల్లీ వాతావరణం మెరుగుపడుతుండడంతో గ్రాప్–4లో సడలింపులకు సుప్రీం కోర్టు అనుమతించింది. గురువారం ఢిల్లీ వాతావరణ కాలుష్యం పిటిషన్ పై విచారణ చేపట్టింది. ప్రజలు చాలా కాలం తరువాత ఈ స్థాయి గాలిని పీల్చగలుగుతున్నారని, ఆకాశం నిర్మలంగా మారుతోందని పేర్కొంది. రెండు నెలల తరువాత వాతావరణం నుంచి ఉపశమనం లభించిందన్నారు. గ్రాప్ 2 కంటే నిబంధనలు సడలించొద్దని పేర్కొంది. గ్రాప్ 3 కిందకు సవరించి కొన్ని చర్యలను తీసుకోవాలని పేర్కొంది. ప్రస్తుతం ఢిల్లీ ఏక్యూఐ 178గా నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో ఏక్యూఐ వందగా నమోదయ్యిందని కాలుష్య నియంత్రణాధికారులు సుప్రీంకు తెలిపారు.
అదే సమయంలో తీవ్ర కాలుష్యానికి కారణమయ్యే వాహనాలపై నిషేధం సడలించొద్దని పేర్కొంది. ఎలక్ర్టిక్ వాహనాలు, సీఎన్జీ వాహనాలకు అనుమతించాలని తెలిపింది. ఇంధన వాహనాలపై నిషేధం కొనసాగుతుందని పేర్కొంది. హైవేలు, రోడ్లు, వంతెనలు ప్రజా ప్రాజెక్టులు సహా అన్ని నిర్మాణ కార్యకలాపాలపై తాత్కాలిక నిషేధం కొనసాగించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.