ఎంసీడీ ఢిల్లీలో ఆప్ కు ఝలక్ బీజేపీలో చేరిన ఇద్దరు కౌన్సిలర్లు
Jhalak to AAP in MCD Delhi are two councilors who joined BJP
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: మున్సిపల్ కార్పొరేషన్ డెవలప్ మెంట్ న్యూ ఢిల్లీలో గురువారం జరగనున్న స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు ముందు ఆప్ కు అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఆ పార్టీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు బుధవారం బీజేపీలో చేరారు. దీంతో ఆప్ లో కలవరం రేగుతోంది. కౌన్సిలర్లు ప్రీతి, సరితా ఫోగట్ లు బీజేపీలో చేరారు. ప్రీతి 217నుంచి, ఫోగట్ 160 వార్డుల నుంచి కౌన్సిలర్లుగా ఉన్నారు. వీరిద్దరు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవా, కేంద్ర సహాయమంత్రి హర్ష్ మల్హోత్రా సమక్షంలో ఆప్ లో చేరారు. ఆగస్టులో కూడా ఐదుగురు కౌన్సిలర్లు బీజేపీలో చేరారు.