అద్వానీకి అనారోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు
Doctors said that Advani's illness is stable
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, రాజకీయ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ (97) ఆరోగ్యం క్షీణించింది. ఆయన్ను ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. శనివారం ఉదయం న్యూరాలజీ విభాగం వైద్యులు అద్వానీ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. సీనియర్ డాక్టర్ వినీత్ సూరి పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఐసీలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అద్వానీ ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. అద్వానీ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు తెలియజేస్తామన్నారు. నాలుగేళ్లలో ఆయన అస్వస్థతకు గురై నాలుగుసార్లు ఆసుపత్రిలో చేరారు. వృద్ధాప్యం దృష్ట్యా ఆయన అనారోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. జూలైలో ఢిల్లీ ఎయిమ్స్ లో చేరి చికిత్స పొందారు.
అద్వానీ 2002 నుంచి 2004 వరకు ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో ఉప ప్రధానిగా పనిచేశారు. 1980లో జనతా పార్టీని రద్దు చేసిన తర్వాత అద్వానీ, అటల్ బిహారీ వాజ్‌పేయితో కలిసి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని స్థాపించారు. వారిద్దరూ కలిసి పార్టీ సిద్ధాంతాన్ని రూపొందించడంలో, భారతదేశం అంతటా దాని ప్రభావాన్ని పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. 1990లో రథయాత్రకు నాయకత్వం వహించారు. రామజన్మభూమి ఉద్యమానికి నాయకత్వం వహించడం అద్వానీ రాజకీయ జీవితంలో మైలురాయిగా చెప్పొచ్చు. అయోధ్యలోని వివాదాస్పద బాబ్రీ మసీదు స్థలంలో రామమందిర నిర్మాణం కోసం 1990లో ఆయన చేసిన రథయాత్ర హిందూ జాతీయవాద భావాలను కదిలించి, ఆయనను ప్రముఖ ప్రజానాయకుడిగా నిలబెట్టింది.