వైద్యరంగంలో భారత్​ ఎదుగుదల

రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ

Dec 17, 2024 - 20:35
 0
వైద్యరంగంలో భారత్​ ఎదుగుదల

మంగళగిరి: సరసమైన వైద్య పర్యాటకానికి భారతదేశం కేంద్రంగా ఎదుగుతోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ అన్నారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్​ లోని మంగళగిరి ఎయిమ్స్​ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షురాలు ముర్మూ మాట్లాడుతూ.. దేశంలో వైద్య  రంగం పురోగతిలో వైద్యులు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. వైద్య వృత్తి మానవాళికి సేవ చేసే మార్గమన్నారు. సేవా దృక్పథం, నిరంతర అభ్యాసం, పరిశోధనలపై దృష్టి సారించాలని ఆమె వైద్యులకు సూచించారు. సంపూర్ణ ఆరోగ్యం ప్రాముఖ్యతను వివరించారు. ఎయిమ్స్​ నినాదం ‘సకల స్వాస్థ్య సర్వదా’ను ప్రశంసించారు. సైటోజెనెటిక్స్ ల్యాబొరేటరీ వినూత్న పరిశోధనలు, పరిష్కారాల దిశగా ప్రయత్నాన్ని ప్రశంసించారు. చికిత్సలు, వైద్య శాస్త్రంలో ఇన్‌స్టిట్యూట్ అగ్రగామిగా నిలుస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్రపతి ముర్మూ శీతాకాల ఐదు రోజుల విడిదికి తెలంగాణ బయలుదేరారు.