ఆవిష్కరణలకు ప్రోత్సాహం అభినందనీయం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

Oct 13, 2024 - 16:36
 0
ఆవిష్కరణలకు ప్రోత్సాహం అభినందనీయం
పీఎం గతిశక్తి జాతీయ పథకానికి మూడేళ్లు పూర్తి
వాణిజ్య మంత్రిత్వ శాఖ, అధికారుల పనితీరు భేష్​
సుస్థిరం నుంచి సమర్థవంతమైన అభివృద్ధి వైపు పయనం
సకాలంలో ఉత్పత్తులు అందజేయడంలో కనెక్టివిటీ కీలకం
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: మౌలిక సదుపాయాల పురోగతి, ఉత్పాదక, నూతనావిష్కరణలు పీఎం గతిశక్తి జాతీయ పథకం ద్వారా మరింత మెరుగుపడుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. శనివారం పీఎం గతిశక్తి జాతీయ పథకంపై మంత్రిత్వ శాఖ సమావేశం నేపథ్యంలో ప్రధాని ఆదివారం ఎక్స్​ మాధ్యమంగా స్పందించారు. 
 
ఉద్యోగాల కల్పన, లాజిస్టిక్​ ల మెరుగు, నూతనావిష్కరణలకు ప్రోత్సాహం లభించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంపై వాణిజ్య మంత్రిత్వ శాఖ, అధికారుల పనితీరును అభినందించారు. ఈ కార్యక్రమం ద్వారా కనెక్టివిటీలోనూ గణనీయ వేగం పెరిగిందన్నారు. అనేక రంగాలు సుస్థిరం నుంచి సమర్థవంతమైన అభివృద్ధిని నమోదు చేస్తున్నాయని తెలిపారు. అదే సమయంలో ఉత్పత్తుల సకాలం కంటే ముందు అందించేందుకు కనెక్టివిటీ దోహదపడుతుందన్నారు. 
 
పీఎం జాతీయ గతిశక్తి పథకం శనివారంతో మూడేళ్లు పూర్తి చేసుకుంది. 2021 అక్టోబర్​ లో ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద నేపాల్​, బంగ్లాదేశ్, శ్రీలంక, మడగాస్కర్, సెనెగల్, గాంబియా వంటి భారత దేశాల మధ్య మౌలిక సదుపాయాల సమగ్ర ప్రణాళికలో పీఎంజీఎస్​, జియోస్పేసియల్ టెక్నాలజీ వినియోగాన్ని ప్రోత్సహించడానికి దౌత్యపరమైన మార్గాలను సుగమం చేసుకున్నామని మంత్రిత్వ శాఖ వివరించింది. ప్రణాళికలు, డేటా, భాగస్వామ్యం, వినియోగదారుల లభ్యత తదితరాలను సురక్షిత పద్ధతిలో అనుసంధానించగలిగామన్నారు. బహుళ కనెక్టివిటీతో ఈ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేశామన్నారు. మూడేళ్లలో 200కు పైగా ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ఇదే సమయంలో ఈ పథకానికి సంబంధించిన పోర్టల్​ ను కూడా అత్యాధునీకరించామని అన్నారు. ఏకీకృత విధానం, అభివృద్ధి వేగవంతం, మూలధన పెట్టుబడుల క్రమబద్ధీకరణ ద్వారా దేశంలో 533 ప్రాజెక్టులకు ప్రణాళికలు వేశామని తెలిపారు.