ఎక్స్​ రెండు లక్షల ఖాతాలు రద్దు

Ex two lakh accounts canceled

Jun 17, 2024 - 16:47
 0
ఎక్స్​ రెండు లక్షల ఖాతాలు రద్దు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్​ లో అసహ్యకరమైన, అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన ఎక్స్​ రెండు లక్షల అకౌంట్లను తొలగించారు. ఈ విషయాన్ని ఎలన్​ మస్క్​ తన ఖాతా ద్వారా సోమవారం స్పష్టం చేశారు. ఏప్రిల్​ 26 నుంచి మే 25 మధ్య పలు ఫిర్యాదులందాయని తెలిపారు. వాటిని పరీశీలించగా ఆ ఖాతాల ద్వారా నిషేధించబడిన పలు అంశాల ప్రస్తావ, వీడియోల విడుదల, తప్పుదోవలు పట్టించే చర్యలకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. దీంతో 2,29,925 ఖాతాలను రద్దు చేశామన్నారు. ఇవే గాక ఉగ్రవాద ప్రచారం నేపథ్యంలో మరో 967 ఖాతాలను కూడా రద్దు చేశామని ఎల్లన్​ మస్క్​ వివరించారు.