బెంగళూరు: గగన్‌యాన్‌ను ఈ ఏడాది చివరి నాటికి ప్రయోగిస్తామని ఇస్రో చీఫ్ ఎస్. సోంనాథ్ తెలిపారు. శుక్రవారం కర్ణాటక బెంగళూరులో జరిగిన స్పేస్ ఎక్స్‌పోను సందర్శించిన సందర్భంగా సోమనాథ్ ఈ విషయాన్ని మీడియాతో వెల్లడించారు. గగన్ యాన్ ప్రాజెక్టు ను కేబినెట్ లో బుధవారం ఆమోదం పొందింది. భారత్ చేపట్టబోయే తొలి మానవ అంతరిక్ష యాత్రకు సంబంధించిన వివరాలను సోంనాథ్ వెల్లడించారు.
చంద్రయాన్-4 మిషన్‌కు సంబంధించి, ఇస్రో ఇంజనీరింగ్ దశను పూర్తి చేసిందని తెలిపారు. చంద్రయాన్-3తో పోలిస్తే ఈ మిషన్ లక్ష్యాలను వెల్లడించారు. పరిమాణం, అదనపు మాడ్యూల్స్ కారణంగా దీనికి రెండు ప్రయోగాలు అవసరమవుతాయని చెప్పారు. చంద్రునిపై ల్యాండింగ్ తర్వాత భూమికి తిరిగి రావడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం, విశ్లేషణ కోసం చంద్రుని నమూనాలను సేకరించడంపై దృష్టి పెట్టామన్నారు. 2040 నాటికి సాంకేతికతను సాధించి భారత శక్తి సామర్థ్యాలను పెంపొందిస్తాన్నారు. 2035 వరకు భారతీయ అంతరిక్ష కేంద్రం కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తామన్నారు.