కండక్టర్ మృతికి మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ సంతాపం
Conductor Dead Former District Library Chairman Santapam
నా తెలంగాణ, డోర్నకల్: కండక్టర్ వెంకన్న మృతికి మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు సంతాపం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామంలో వెంకన్న భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకన్న సేవలను కొనియాడారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.వెంకన్న కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపారు. నవీన్ రావు వెంట రామడుగు అచ్యుత్ రావు, తాళ్లపల్లి శ్రీను, తాళ్లపల్లి రఘు, దిగజర్ల పేపర్ శ్రీను, అంబరీష, గండి చిన్నబాబు, పుల్లయ్య, భద్రయ్య, కృష్ణమూర్తి, కొండం దశరథ, గండి మహేష్ తదితరులు ఉన్నారు.