తిరుగులేని శక్తిగా బీజేపీ
అంచలంచెలుగా ఎదుగుతూ.. ప్రజాభీష్టం దిశలో అడుగులు మోదీ రాకతో తిరుగులేని పార్టీగా అవతరణ
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: ఎవ్వరూ ఊహించని విధంగా కేవలం రెండంటే రెండు సీట్ల నుంచి సుమారు 400 సీట్లకు దగ్గరగా రావడం అంటే ఆషామాషీ విషయం ఏం కాదు. దేశ ప్రజల మన్ననలు, వారి అభీష్టాలు, మంచి, చెడులను తెలుసుకోని మసలు కోవాల్సి ఉంటుంది. ఆ ప్రయత్నాల్లో బీజేపీ విజయం సాధించింది. తొలుత శ్యామ ప్రసాద్ ముఖర్జీ 1951 జనసంఘ్ను స్థాపించారు. 1980 ఏప్రిల్ 6న ముంబైలో అటల్ బిహారీ బాజ్‌పేయి, లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి ప్రముఖులు జనసంఘ్ను విలీనం చేసుకొని బీజేపీ గా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం బీజేపీ మోదీ నేతృత్వంలో తిరుగులేని సత్తా చాటుకుంటోంది. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించడం గమనార్హం.
ముఖర్జీ జన సంఘ్ విలీనం..
శ్యామా ప్రసాద్ ముఖర్జీ 21 అక్టోబర్ 1951న భారతీయ జనసంఘ్‌ను స్థాపించారు. ఆయన మరణానంతరం వాజ్‌పేయి, అద్వానీ సహా పలువురు ప్రముఖులు పార్టీ అధ్యక్షులు అయ్యారు. 1977లో భారతీయ జన్ సంఘ్ ఉనికికి ముగింపు పలికి జనతా పార్టీలో విలీనం చేశారు.
1977లో పడిపోయిన దేశాయ్ ప్రభుత్వం..
జనతా పార్టీలో అంతర్గత కుమ్ములాటల కారణంగా 1977లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత, సంఘీ నాయకులు కొత్త వేదికను ఏర్పాటు చేయాలని భావించారు. అదేవిధంగా, భారతీయ జనతా పార్టీ 6 ఏప్రిల్ 1980న స్థాపించబడింది. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం సానుభూతి ఓట్లతో కాంగ్రెస్ 400 సీట్లకు పైగా గెలుచుకోగలిగింది. బీజేపీకి కేవలం రెండు సీట్లు మాత్రమే దక్కాయి.
1984లో గుజరాత్‌లోని మెహసానా నుంచి ఏకే పటేల్, ఆంధ్రప్రదేశ్‌లోని హనుమకొండ నుంచి పాండు భాయ్ పాటియా జంగారెడ్డి బీజేపీ టికెట్‌పై గెలిచి పార్లమెంటుకు చేరుకున్నారు. వాజ్‌పేయి, ఆ తర్వాత లాల్‌కృష్ణ అద్వానీ ఆరేళ్లపాటు పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు.
1989లో రెండు స్థానాలతో సరి..
1989లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ రెండు స్థానాల్లో ఉన్న ఆ పార్టీ 85 స్థానాల్లో విజయం సాధించే విధంగా మారింది. అప్పటి నుంచి నేటి వరకు బీజేపీ నిరంతరం ముందుకు సాగుతోంది. 1991లో బీజేపీ 120 సీట్లు గెలుచుకుంది. 1996లో బీజేపీ 161 సీట్లు గెలుచుకుని పార్లమెంట్‌లో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ సమయంలో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రి అయ్యారు. కానీ మెజారిటీ లేకపోవడంతో కేవలం 13 రోజుల్లోనే రాజీనామా చేయాల్సి వచ్చింది.
1999లో తొలిసారిగా పూర్తికాలం ప్రభుత్వం..
మధ్యంతర ఎన్నికల కోసం బీజేపీ ఇతర పార్టీలతో ఒప్పందం చేసుకుని ఎన్డీయే ఏర్పాటు చేసింది. బీజేపీ 182 సీట్లు గెలుచుకుని అటల్ బిహారీ వాజ్‌పేయి రెండోసారి ప్రధాని అయ్యారు. అయితే 13 నెలల తర్వాత ఆయన ప్రభుత్వం పడిపోయింది. 1999 ఎన్నికల్లో బీజేపీ మళ్లీ గెలుపొందగా, ఎన్డీయే 303 సీట్లు గెలుచుకుంది. ఈ కాలంలో, వాజ్‌పేయి ప్రభుత్వం పూర్తిగా ఐదు సంవత్సరాలు కొనసాగింది.
2014లో తిరుగులేని ఆధిక్యత..
2004 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 138 సీట్లు గెలుచుకుంది. 2009లో ఆ పార్టీ 116 సీట్లు గెలుచుకుంది. 2014లో నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ 283 సీట్లు గెలుచుకొని తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శిస్తూ వస్తోంది. అప్పటి నుంచి బీజేపీ గ్రాఫ్ రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది.
మళ్లీ మోదీకే జై అన్న ప్రజలు..
2019లో బీజేపీ 300 సీట్లకు పైగా గెలిచి చరిత్ర సృష్టించింది. ఎన్డీయే 350కి పైగా సీట్లు గెలుచుకుంది. ఇప్పుడు 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు, ఎన్డీఏ 400 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా పార్టీ నిరంతరం కృషి చేస్తోంది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా వంటి పలువురు ప్రముఖులు ప్రచారం ప్రారంభించారు.
2024లో ప్రపంచవ్యాప్తంగా మోదీకీ జై..
2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని పలువురు రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. అయితే 370 సీట్లు గెలవడం ఆ పార్టీ లక్ష్యం కాస్త కష్టమే అయినా అసాధ్యం కాకపోవచ్చని భావిస్తున్నారు. దేశంలోనే గాక ప్రపంచవ్యాప్తంగా మోదీ మేనియా, చరిష్మాలు పాకాయన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ గెలుపు ఖాయమే అయినా సీట్ల విషయంలో ఐదు పది స్థానాల్లో తేడా ఉండొచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.