ఖర్చులపై దృష్టి

అధికారులతో ఈసీ అధికారుల భేటీ

Aug 31, 2024 - 16:45
 0
ఖర్చులపై దృష్టి

శ్రీనగర్​: తొలి విడత నామినేషన్​ ల ఘట్టం పూర్తయ్యాక ఈసీ (ఎన్నికల కమిషన్​) అభ్యర్థుల ఖర్చులపై దృష్టి సారించింది. ఇప్పటికే ఖర్చులపై పరిమితులు విధించిన ఈసీ అభ్యర్థులకు ఖర్చు వివరాలపై మరోసారి అవగాహన కల్పించాలని శనివారం మైక్రో అబ్జర్వర్లను ఆదేశించింది. శ్రీనగర్​ ఎన్నికల అధికారులు ప్రదీప్​ శౌర్య, సుబోధ్​ సింగ్​ లో ఎన్నికల వ్యయంపై అధికారులతో సమీక్షించారు. ఎన్నికల్లో ఆర్థిక ప్రభావం ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్థిక స్వేచ్ఛలో పరిమితులుంటాయన్నారు. వాటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ నివేదికలను ఇవ్వాలన్నారు. షాడో (ఒకే ఖాతా ద్వారా ఖర్చైన వివరాలు) నివేదికలను ఎప్పటికప్పుడు సిద్ధం చేస్తూ ఉండాలన్నారు.