వృక్షరోపన్​ లో మొక్కలు నాటిన కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి

Union Minister Kishan Reddy planted saplings in the plantation

Jul 25, 2024 - 14:11
Jul 25, 2024 - 15:36
 0
వృక్షరోపన్​ లో మొక్కలు నాటిన కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి

రాంచీ: పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలని తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి అన్నారు. గురువారం ఝార్ఖండ్​ లోని ధన్​ బాద్​ లో ‘వృక్షరోపన్​ అభియాన్​ 2024’లో బొగ్గు గనుల శాఖల తరఫున పాల్గొని మొక్కలు నాటారు. 2020లో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద 35 జిల్లాల్లో 2024లో 35 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 
 

కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డికి రాంచీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. గార్డ్ ఆఫ్​ హానర్​ తో ఆ రాష్ర్ట ప్రభుత్వం స్వాగతం పలికింది. అనంతరం కోల్​ నగర్​ లోని షాహిద్​ చౌకన్​ ను సందర్శించిన ఆయన అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం పంచవటి పార్కులో ఏర్పాటు చేసిన వృక్షరోపన్​ లో మొక్కలు నాటారు. రాష్ర్టంలోని బొగ్గు గనులపై అధికారులతో సమీక్షించారు. బొగ్గు, గనుల శాఖ కేంద్రమంత్రిగా నియమితులయ్యాక జి.కిషన్​ రెడ్డి అధికారికంగా ఝార్ఖండ్​ పర్యటన ఇదే తొలిసారి.