ముఖర్జీ వర్థంతి వేడుకలు

Mukherjee's death celebrations

Jun 23, 2024 - 21:00
 0
ముఖర్జీ వర్థంతి వేడుకలు

నా తెలంగాణ, రామకృష్ణాపూర్: దేశం కోసం శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ చేసిన త్యాగం మరువలే నిదని రామకృష్ణాపూర్ బీజేపీ పట్టణ అధ్యక్షుడు వేముల అశోక్ పేర్కొన్నారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ శ్యామ్‌ప్రసాద్‌ దేశం కోసం తన ప్రాణాలర్పించారని గుర్తుచేశారు. ముఖర్జీ వర్థంతి వేడుకలను వారం పాటు పురపట్టణంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి కట్ట ఈశ్వర చారి, మాస్ సత్యనారాయణ, సీనియర్ నాయకులు బంగారు వేణుగోపాల్, పట్టణ ఉపాధ్యక్షులు వైద్య శ్రీనివాస్, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు సంతోష్ రామ్ నాయక్, సీనియర్ నాయకులు కుమ్మరి రామ కిషోర్, జీడి ప్రభాకర్, భద్రి శ్రీనివాస్, మోత్కూరి దేవేందర్, ఉరుసు నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.