ఎన్నికల్లో లబ్ధి కోసమే భారత్​తో ముయిజ్జూ దురుసుతనం

మండిపడ్డ మాల్దీవులు మాజీ అధ్యక్షుడు సోలిహ్​.. మిత్రదేశంతో వైరమా? క్షమాపణలు చెప్పి సత్సంబంధాలను కొనసాగించాలని డిమాండ్​

Mar 25, 2024 - 15:21
 0
ఎన్నికల్లో లబ్ధి కోసమే భారత్​తో ముయిజ్జూ దురుసుతనం

నా తెలంగాణ, ఢిల్లీ: అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందేందుకు భారత్​తో దురుసుగా ప్రవర్తించి మాల్దీవులకు అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ నష్టం కలిగించారని మాజీ అధ్యక్షుడు సోలిహ్ మండిపడ్డారు. ముయిజ్జూ భారత్​తో సంబంధాలను కోరుకుంటున్నారనే ఆదివారంనాటి ప్రకటనతో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాల్దీవులు ప్రస్తుతం ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నదన్న విషయం ముయిజ్జూకు తెలవదా? అని ప్రశ్నించారు. చైనాతో 18 బిలియన్ల రుణం, భారత్​తో 8 బిలియన్ల ఋణం తిరిగి సకాలంలో చెల్లించాలన్న స్పృహ లేదా? అని ప్రశ్నించారు. భారత్​ అనేకమార్లు తమకు ఏదో ఒక రకంగా సహాయపడుతూనే ఉందని పేర్కొన్నారు. మంచి మిత్ర దేశాన్ని ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు వాడుకుంటారా? అని మండిపడ్డారు. ఇప్పటికైనా మొండిపట్టుదలను వీడి భారత్​కు బహిరంగంగా క్షమాపణలు చెప్పి వాణిజ్య, వ్యాపార, స్నేహ సంబంధాలను పునరుద్ధరించుకుంటే మంచిదని లేకుంటే భవిష్యత్ లో మాల్దీవులు ప్రజలే ముయిజ్జూను తరిమికొట్టే రోజు వస్తుందని సోలిహే అన్నారు.