జూలై నుంచి హెల్త్‌ప్రొఫైల్ కార్డులు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు జూలై నుంచి హెల్త్ ప్రొఫైల్ కార్డులు అందజేయనున్నట్లు ఐటీ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.
నా తెలంగాణ, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు జూలై నుంచి హెల్త్ ప్రొఫైల్ కార్డులు అందజేయనున్నట్లు ఐటీ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఆర్టీసీ కళాభవన్‌లో మంథని వేదిక్ సంస్థ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో తెలంగాణలో ప్రతీ ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డులు సమకూరనున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన చికిత్స అందించేందుకు ఈ కార్డులను ప్రత్యేక నంబర్‌తో రూపొందించనున్నారు. తన 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉండి రాజకీయాలకు అతీతంగా సేవలందించానని తెలిపారు. ప్రజాసేవ చేయాలంటే ఎంతో ఓపిక, సహనం అవసరమని అన్నారు. మంథని ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని, వారి శ్రేయస్సుకు కృషి చేస్తానని మంత్రి దుద్దిళ్ల స్పష్టం చేశారు.