నేపాల్ లో కుండపోత 39 మంది మృతి
39 people died in the flood in Nepal
భూటాన్: నేపాల్ ను కుండపోత వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వర్ష బీభత్సంతో శనివారం వరకు 39 మృతి చెందగా వేలాది మంది నిరాశ్రయులయ్యారని అధికారులు ప్రకటించారు. శుక్రవారం నుంచి కురుస్తున్న ఆకస్మిక వరదలతో నేపాల్ లోని పలు నగరాలు, గ్రామీణ ప్రాంతాలు నీట మునిగాయి. వాహనాలు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రభుత్వం ఆర్మీ, రెస్క్యూ బృందాలను రంగంలోకి దింపి వేలాది మందిని సురక్షిత ప్రాతాలకు తరలించే చర్యలు చేపట్టింది. ఖాట్మాండులో 9, లలిత్ పూర్ లో 16, భక్తపూర్ లో 5, కవ్రేపాలంలో 3, పంచ్ తార్, ధన్ కూట్, ఝాఫా, ధాడింగ్ లలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. ఖాట్మాండులో 226 పూర్తిగా నీట మునిగాయి. రహదారులు దెబ్బతినడంలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది.