మిసెస్ వరల్డ్ పీస్ డాక్టర్ చంద్రికకు సన్మానం
Mrs. World Peace is a tribute to Dr. Chandrika
నా తెలంగాణ, నిర్మల్: ఇటీవల నిర్వహించిన మిసెస్ వరల్డ్ పోటీల్లో తెలంగాణా నుంచి మిసెస్ వరల్డ్ పీస్ గా ఎంపికైన డాక్టర్ చంద్రికను తెలంగాణ బీసీ మహాసభ ఆధ్వర్యంలో ఆదివారం సన్మానించారు. వైద్య వృత్తి, కుటుంబ బాధ్యతలు ఏక కాలంలో నిర్వహిస్తూ టైటిల్ సాధించినందుకు ఈ సన్మానం చేశారు. తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాటకారి సాయన్న ఆధ్వర్యంలో చంద్రిక, అవినాష్ దంపతులను సన్మానించిన అనంతరం ఆయన మాట్లాడుతూ వృత్తి నైపుణ్యంతో మున్ముందు పేదలకు మరింత సేవలందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ మహాసభ నిర్మల్ జిల్లా అధ్యక్షులు మూర్తి ప్రభు, యూత్ రాష్ట్ర నాయకులు సుంకరి సాయి, నాయకులు బొద్దుల వెంకటరమణ, రామారావు, దేవరశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.