అక్షర యోధుడి అంత్యక్రియలు పూర్తి
Akshara Yodha's last rites are complete
నా తెలంగాణ, హైదరాబాద్: అక్షర యోధుడు రామోజీరావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆయన అంత్యక్రియలకు ప్రముఖులు హాజరయ్యారు. ఆదివారం తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో రామోజీ ఫిల్మ్ సిటీలోని స్మృతివనంలో రామోజీరావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. అంతిమ యాత్ర 4 కిలోమీటర్లు కొనసాగింది. కడసారి వీడ్కోలు పలికేందుకు కుటుంబసభ్యులు, అభిమానులు, జర్నలిస్టులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అంతిమ సంస్కారాలను కిరణ్ నిర్వహించారు. రామోజీ గ్రూప్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఎర్రబెల్లి, హనుమంతరావు, సుజనా చౌదరీ, జస్టిస్ ఎన్వీ రమణ తదితర ప్రముఖులు హాజరయ్యారు.