రోడ్డు ప్రమాదంలో తల్లీ, కుమారుడి దుర్మరణం

మరొకరి పరిస్థితి విషమం

Aug 4, 2024 - 21:22
 0
రోడ్డు ప్రమాదంలో తల్లీ, కుమారుడి దుర్మరణం

నా తెలంగాణ, షాద్ నగర్: షాద్ నగర్ నియోజక వర్గంలోని నందిగామ మండలం రంగాపూర్ శివారు దర్గా రోడ్డు మూలమలుపుపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీపై వెళుతున్న చంద్రాయన్ గుట్టకు చెందిన తల్లి కుమారులు హజ్రబేగం (35), అబ్దుల్ రహమాన్ (12), అబ్దుల్ రహీం(9)లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా హజ్రబేగం, అబ్దుల్ రహమాన్ చికిత్స పొందుతూ మరణించారు. అబ్దుల్ రహీం(9) పరిస్థితి విషమంగా ఉంది. రంగాపురం గ్రామశివారులో మూలమలుపు వద్ద స్కూటీపై ప్రయాణిస్తున్న హజ్రబేగం ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి  ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొంది. దీంతో ప్రమాదం చోటుచేసుకుంది.