పాఠశాలపై ఐడీఎఫ్ దాడి వందమంది మృతి
IDF attack on school kills 100
జెరూసలెం: గాజాలోని అల్ సహాబా ప్రాంతంలో పాఠశాలపై ఐడీఎఫ్ దాడికి పాల్పడింది. ఈ దాడుల్లో వంద మంది వరకు మరణించారు. ఈ పాఠశాలలో హమాస్ ఉగ్రవాదులు షెల్టర్ తీసుకున్నారనే దాడులు చేశామని శనివారం ఐడీఎఫ్ ఉన్నతాధికారి వెల్లడించారు. కాగా ఈ దాడుల్లో సామాన్య ప్రజలు కూడా సమిధలయ్యారు.
పాఠశాలను ఉగ్రవాదులు హమాస్ కమాండ్ సెంటర్ గా ఉపయోగిస్తూ ఇజ్రాయెల్ పై దాడులకు కుట్రలు పన్నుతున్నారనే దాడులకు పాల్పడ్డట్టు తెలిపారు. ఉగ్రవాదులు పాఠశాలలు, ఆసుపత్రులను ఆసరాగా చేసుకొని దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. అందుకే వీటిపై దాడి చేయాల్సి వస్తోందని ఐడీఎఫ్ స్పష్టం చేసింది.
కాగా తొలుత 40 మంది చనిపోయినట్లుగా భావించినా, మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ వైమానిక దాడిలో వందమంది చనిపోయారని పలువురికి తీవ్ర గాయాలయ్యాయని స్థానిక అధికారులు వెల్లడించారు.
మరోవైపు ఇరాన్ ఇజ్రాయెల్ పై దాడుల హెచ్చరికలపై అమెరికా స్పందిస్తూ తీవ్ర పరిణామాలుంటాయని అమెరికాను హెచ్చరించింది. తాజా దాడిలో ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య మరింత దాడులు తీవ్రతరం అయ్యే అవకాశం లేకపోలేదు.