బంగ్లా ప్రభుత్వాధినేతగా మహమ్మద్​ యూనస్​

ప్రమాణ స్వీకారం పౌరహక్కులను కాపాడాలి హింసాత్మక పద్ధతులు విడనాడాలన్న యూనస్​ విధుల్లోకి చేరిన పోలీసులు

Aug 8, 2024 - 21:42
 0
బంగ్లా ప్రభుత్వాధినేతగా మహమ్మద్​ యూనస్​

ఢాకా: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్ యూనస్ (84) ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం రాత్రి యూనస్​ ఆయన రాత్రి 8.30 గంటలకు రాజధాని ఢాకాలోని రాష్ట్రపతి అధికారిక నివాసం బంగా భవన్‌లో రాష్ర్టపతి మహ్మద్​ షాబుద్దీన్​ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈయనతోపాటు పలువురు మంత్రివర్గ నేతలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బ్రిటన్, జపాన్, చైనా, ఫిలిప్పీన్స్, ఇరాన్, అర్జెంటీనా, ఖతార్, నెదర్లాండ్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలకు చెందిన దౌత్యవేత్తలు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. ఈ ప్రమాణ స్వీకారంలో అవామీ లీగ్ సభ్యులు హాజరు కాలేదు. 

పదవీ బాధ్యతలను చేపట్టేందుకు పారిస్​ నుంచి గురువారమే మహమ్మద్​ యూనస్​ బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చారు. రాగానే ఆయన మాట్లాడుతూ.. బంగ్లాదేశ్​ కు రెండోసారి స్వాతంత్ర్యం వచ్చిదన్నారు. దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. పౌరహక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. బంగ్లాలో శాంతి స్థాపనకు ప్రతీ ఒక్కరూ కట్టుబడి ఉండాలని, హింసాత్మక విధానాన్ని విడనాడాలన్నారు. అంతకు ముందు పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన విద్యార్థులను యూనస్​ నివాళులర్పించారు.

తాత్కాలిక ప్రభుత్వాధినేతగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే పోలీసులు విధుల్లోకి చేరారు. బంగ్లాదేశ్​ నూతన పోలీస్​ చీఫ్​ గా నియమితులైన ఐజీ ఎకెఎం షాహిదుర్ రెహ్మాన్, పోలీసులను తిరిగి విధుల్లోకి చేరాలని కోరారు. పుకార్లను పట్టించుకోవద్దని, దశలవారీగా విధుల్లో చేరాలని సూచించారు. దేశంలో శాంతి, సామరస్యాన్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు.