ఫలిస్తున్న మోదీ కఠిన వైఖరి

ఇద్దరు ఖలిస్థానాల విమాన ప్రయాణాలకు అనుమతి నిరాకరణ

Jun 21, 2024 - 19:06
 0
ఫలిస్తున్న మోదీ కఠిన వైఖరి

ఒట్టావా: ఎట్టకేలకు ఖలిస్థానీల విషయంలో ప్రధాని మోదీ వ్యూహం, కఠిన వైఖరి ఫలిస్తోంది. కెనడాలో ఉన్న  ఖలిస్థానీలు ఉగ్రచర్యలకు పాల్పడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో కెనడా కోర్టు వారికి విమాన ప్రమాదానికి అనుమతించలేమని స్పష్టం చేసింది. నో ఫ్లై జాబితా నుంచి తమను తొలగించాలని ఇద్దరు ఖలిస్థానీలు (భగత్ సింగ్ బ్రార్, పర్వ్‌కర్ సింగ్ దులాయ్) చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. ఉగ్రవాద ముద్ర పడ్డ వీరికి విమాన ప్రయాణానికి అనుమతించలేమని కుండబద్ధలు కొట్టింది. దీంతో కెనడా ప్రధాని జస్టిస్​ ట్రూడో భారత పట్ల అనుసరిస్తున్న వైఖరి తప్పేనని నిరూపితమవుతోందని పలువురు పేర్కొంటున్నారు. 

కోర్టు విమాన ప్రయాణానికి నిషేధించిన బ్రార్​, దులాయిలను ఉగ్రచర్యల నేపథ్యంలో భారత్​ నిషేధం విధించింది. అనేకమార్లు ఖలిస్థానీ ఉగ్రవాదంపై ప్రధాని మోదీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నప్పటికీ కెనడా ప్రభుత్వం వారిని వెనకేసుకొస్తోంది. ప్రస్తుతం కోర్టు తీర్పుతో కెనడా ప్రధాని వ్యవహారశైలిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.