రెండోసారి బంగ్లా ప్రధాని పర్యటన
చైనా. పాక్ లో కలవరపాటు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: 15 రోజుల్లోనే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా శుక్రవారం రెండోసారి భారత్ పర్యటనకు వచ్చారు. రెండోసారి హసీనా పర్యటనపై చైనా, పాక్ దేశాల్లో కలవరపాటు మొదలైంది. జూన్ 9న ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆమె హాజరయ్యారు. ప్రధాని షేక్ హసీనాకు భారత అధికారులు ఘన స్వాగతం పలికారు. రెండు రోజుల పర్యటనలో షేక్ హసీనా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌లతోనూ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.
ప్రధాని మోదీ, షేక్ హసీనాల మధ్య జరిగే ద్వైపాక్షిక చర్చల్లో సరిహద్దు కనెక్టివిటీ నుంచి తీస్తా నీటి భాగస్వామ్య ఒప్పందం వరకు, మయన్మార్‌లో భద్రతా పరిస్థితితో పాటు బంగ్లాదేశ్‌కు చెందిన ఆర్థిక, వాణిజ్య సమస్యలపై అత్యవసర చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది.