అసోంలో పోటీ టికెట్లమ్ముకున్న కాంగ్రెస్
బీజేపీ మంత్రి పిజూష్ ఆరోపణ
డీస్పూర్: అసొం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులకు రూ. 2 కోట్లకు టికెట్ అమ్ముకుందని బీజేపీ మంత్రి పిజూష్ హజారికా ఆరోపించారు. గురువారం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బెహాలీ నియోజకవర్గంలో జరిగిన ప్రచార సభలో మంత్రి హజారికా మాట్లాడారు. ఈ డబ్బంతా కాంగ్రెస నాయకులు గౌరవ్ గొగోయ్, జితేంద్ర సింగ్ కు వెళ్లిందని ఆరోపించారు. అసోంలో నవంబర్ 23న ఐదు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఐదు స్థానాలకు గాను 24 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మరోవైపు ప్రతిపక్షాలకు కాంగ్రెస్ స్థానాలను ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఉప ఎన్నిక మరింత రసవత్తంగా మారింది.