హజ్ యాత్రలో 98 భారతీయులు మృతి
98 Indians died in Hajj
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: హజ్ యాత్రలో గురువారం వరకు 98మంది భారతీయులు మృతి చెందినట్లు భారత విదేశాంగ శాఖ శుక్రవారం ప్రకటించింది. వృద్ధాప్యం, ఎండల వల్ల అనారోగ్యంతో మృతిచెందినట్లు తెలిపింది. హజ్ యాత్ర జూలై 25 వరకు కొనసాగనుందని స్పష్టం చేసింది. గతేడాది భారత్ నుంచి హజ్ కు వెళ్లిన వారిలో 187 మంది మృతిచెందారని విదేశాంగ శాఖ ప్రకటించింది.