ఫరూఖ్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపాటు
BJP angry over Farooq's comments
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: వరుస ఉగ్రదాడుల వెనుక నూతన ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రకోణం దాగి ఉందన్న జేకేఎన్సీ ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ, అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది విరుచుకుపడ్డారు.. శనివారం ఫరూఖ్ వ్యాఖ్యలపై సుధాన్షు మీడియాతో మాట్లాడారు. మీ వద్ద సమాచారం ఏదైనా ఉంటే అది కేంద్రంతో పంచుకోవడం లేదని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం సరైన విధంగానే వెళుతుందన్నారు. ఉగ్రవిచారణ సరైన దిశలోనే కొనసాగిస్తున్నామన్నారు. ఒకవేళ ఏదైనా సమాచారం ఉంటే కేంద్రంతో పంచుకోవాలన్నారు. రాష్ర్ట గవర్నర్ కు ఆయా విషయాలను వివరించాలన్నారు.
మరో బీజేపీ నాయకుడు షహజాద్ పూణేవాలా మాట్లాడుతూ.. ఇలాంటి సున్నితమైన అంశంపై, ఫరూఖ్ అబ్దుల్లా దేశానికి ప్రాధాన్యత ఇవ్వకుండా, రాజకీయాలు, కుటుంబం, ఓటు బ్యాంకుకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా దురదృష్టకరమన్నారు. భారత సైన్యాన్ని, భారత ఏజెన్సీలను నిందించడం, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేవారిని రక్షించడం ఫరూక్ అబ్దుల్లాకు తగదన్నారు. 26/11 కేసులో పాకిస్థాన్‌కు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారికి కాంగ్రెస్ క్లీన్ చిట్ ఇచ్చిందనీ, ఇప్పుడు అదే విధానాన్ని ఫరూక్ వ్యక్తం చేయడం మంచిది కాదని విమర్శించారు.
ఉదయం మీడియాతో ఫరూఖ్ అబ్దుల్లా మాట్లాడుతూ.. తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర కోణం దాగి ఉందన్నారు. ఉగ్రవాదులను పట్టుకొని విచారణ జరిపి వారి వెనుక ఎవరున్నారో తెలుసుకోవాలని సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.