మోదీకి నోబెల్ ఇవ్వాలి
ప్రముఖ పెట్టుబడిదారు మోబియస్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ప్రముఖ పెట్టుబడిదారు మార్క్ మోబియస్ -అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచంలో మోదీ శక్తివంతమైన, శాంతి పరిరక్షణలో కీలకంగా వ్యవహరిస్తున్న భారత ప్రధాని మోదీ ఈ గౌరవానికి అర్హుడని అన్నారు. మంగళవారం ఓ ప్రకటనలో తన అభిప్రాయాన్ని మోబియస్ వ్యక్తం చేశారు. ప్రపంచస్థాయిలో మోదీ అన్ని దేశాలు, రాజకీయ నాయకులు, పార్టీలతోనూ మాట్లాడుతూ.. ప్రపంచ శాంతికి కృషి చేస్తున్నారని, అదే సమయంలో ప్రపంచంలోని పలుదేశాలు క్లిష్టతరుణంలో ఉన్నప్పుడు ఆపన్నహస్తం అందించారని గుర్తు చేశారు. అంతర్జాతీయంగా మోదీ పాత్ర వేగంగా పెరుగుతుందన్నారు. పశ్చిమాసియా దేశాల్లో శాంతిని నెలకొల్పే దిశగా మోదీ వేస్తున్న అడుగులు అందరికీ తెలిసినవేనన్నారు. అన్నిదేశాలతో తటస్థ వైఖరితో, శాంతియుతంగా ముందుకు వెళ్లగలిగే దేశం ప్రస్తుతం భారత్ ఒక్కటేనని తెలిపారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని నివారించాలని కూడా ఆయన బహిరంగంగానే తెలిపారని గుర్తు చేశారు.