మోదీ కేబినెట్​ తీపికబురు రైతుల ఎంఎస్​పీ ధరల పెంపు

ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంపు గంగా నదిపై రూ. 2642 కోట్ల వ్యయంతో మరో బ్రిడ్జి వివరాలు వెల్లడించిన కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్​

Oct 16, 2024 - 16:38
 0
మోదీ కేబినెట్​ తీపికబురు రైతుల ఎంఎస్​పీ ధరల పెంపు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ:  కేంద్ర ప్రభుత్వం దీపావళికి ముందు రైతులకు తీపికబురందించింది. పలు రకాల రబీ పంటలపై ఎంఎస్​ పీ ధరలను పెంచింది. బుధవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్​ భేటీ నిర్వహించారు. ఈ భేటీలోని తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్​ మీడియాకు వెల్లడించారు. ఎంఎస్​ పీ పెంపు, కేంద్ర ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంపుపై వివరాలందించారు. 

గోధుమ పంటకు క్వింటాల్​ కు రూ. 150, ఆవాల పంటపై రూ. 300, కందులు రూ. 275, కుసుమకు రూ. 140 పెంచినట్లు ప్రకటించారు. అదే సమయంలో కేంద్ర ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంచుతున్నట్లు ప్రకటించారు. అశ్వినీ వైష్ణవ్​ మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం కట్టుబడి మోదీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. తమకు రైతుల సంక్షేమం అత్యంత ముఖ్యమన్నారు. ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు మేలు చేకూరుతుందని తెలిపారు. గంగానదిపై మరో రైల్​ కమ్​ రోడ్​ బ్రిడ్జిని నిర్మించాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం రూ. 2642 కోట్లు వెచ్చించనున్నట్లు మంత్రి అశ్వినీ వైష్ణవ్​ స్పష్టం చేశారు.