మోదీ కేబినెట్ @ 3.0
నూతన మంత్రులకు పిలుపు అర్థరాత్రి వరకు కూర్పుపై అమిత్ షా నేతృత్వంలో చర్చలు ప్రమాణ స్వీకారానికి ముందే నూతన మంత్రిమండలితో ప్రధాని భేటీ
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కేంద్రమంత్రివర్గంలో ఉన్నవారికి ఒక్కొక్కరికి పిలుపు వస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంట్లో శనివారం అర్థరాత్రి వరకూ మంత్రి వర్గ కూర్పుపై బీజేపీ నాయకులు తీవ్ర చర్చలు జరిగాయి. అనంతరం మంత్రి మండలి కూర్పును ఫైనల్ చేశారు. ఆదివారం ఉదయాన్నే మంత్రిమండలిలో చోటు దక్కించుకున్న వారికి పిలుపు అందుతోంది. తెలంగాణ నుంచి జి.కిషన్ రెడ్డి (సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు), బండి సంజయ్ లకు చోటు దక్కింది.
శివరాజ్, రాజ్‌నాథ్, సింధియా, చిరాగ్, జయంత్.. మోడీ క్యాబినెట్‌లోని మంత్రులకు పిలుపుపొచ్చింది. నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, జితన్ రామ్ మాంఝీ, చిరాగ్ పాశ్వాన్, జయంత్ చౌదరి, రామ్‌నాథ్ ఠాకూర్, అనుప్రియా పటేల్‌తో పాటు మరికొందరికి పిలుపువచ్చినట్లు తెలుస్తోంది.
ఎవరెవరికి పిలుపొచ్చింది?..
రాజ్‌నాథ్ సింగ్ బీజేపీ
నితిన్ గడ్కరీ బీజేపీ
పీయూష్ గోయల్ బీజేపీ
జ్యోతిరాదిత్య సింధియా బీజేపీ
రక్షా ఖడ్సే బీజేపీ
జితేంద్ర సింగ్ బీజేపీ
శివరాజ్ సింగ్ చౌహాన్ బీజేపీ
జి కిషన్ రెడ్డి బీజేపీ
బడి సంజయ్ కుమార్ బీజేపీ
గిరిరాజ్ సింగ్ బీజేపీ
హర్దీప్ సింగ్ పూరి బీజేపీ
లాలన్ సింగ్ జేడీయూ
జితన్ రామ్ మాంఝీ హెచ్ఏఎం
కుమారస్వామి జేడీఎస్
రామ్‌నాథ్ ఠాకూర్ జేడీయూ
చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీ(ఆర్)
అనుప్రియా పటేల్ అప్నాదళ్
జయంత్ చౌదరి ఆర్ ఎల్ డీ
ప్రతాప్ రావ్ జాదవ్ శివసేన (షిండే)
మోహన్ నాయుడు టీడీపీ
పి చంద్రశేఖర్ టీడీపీ
రావ్ ఇంద్రజీత్ సింగ్ బీజేపీ
మనోహర్ లాల్ ఖట్టర్ బీజేపీ
శంతును ఠాకూర్ బీజేపీ
అశ్విని వైష్ణవ్ బీజేపీ
మన్సుఖ్ మాండవియా బీజేపీ
ఆదివారం మంత్రిమండలిలో ఎంపికైన వారితో ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి ముందే సమావేశం నిర్వహించనున్నారు.